Tuesday, March 18, 2008

నేటి స్త్రీ తేజం

పాస్చ్యాత్య మోజులో పడి కొట్టు మిట్టాడుతున్న

నేటి యువరక్తమా మేలుకో!

మన సంస్కౄతి ,కట్టూ, బొట్టూ

ఆచార వ్యవహారలనేనాడు విస్మరించకు

అనాగరికమైన వేషభాషలను విడనాడి

వాని వునికికి స్వస్తి పలుకు

పరమ పవిత్ర భరతావనిలో అందునా

స్వఛ్చమైన అంధ్రదేశం లో జన్మించే

అదౄష్ఠ భాగ్యం కల్గినందులకు సంతసం తో గర్వపడు

తెలుగు తనాన్నంతా పుణికి పుచ్చుకుని

తెలుగు వెలుగు లా ప్రకాసించే ఓ స్త్రీ తేజమా!

మారుతున్న సమాజానికి అనుగుణంగా మారావ్!

నీ చలాకీతనం ,ధైర్యం,సాహసం,ప్రతిభా సామర్ధ్యాలు

స్వతంత్ర్య భావలతో అన్నింటా ముందుకు సాగుతున్నవ్!

కాని!

నేటి భాద్యతల నడుమ నీ పాదాలకుపండేటి ఎర్రటి

గోరింటాకు చూడటం గగనం అవుతుంది

ఈ కాంక్రీట్ జంగిల్ లో నల్లపూసైన

తెలుగుతనాన్కి వన్నె తెచ్చే పట్టుపరికిణీల

రెపరెపలు, గలగల లాడె గాజుల సవ్వడులు

జాలువారిన కురుల మీద పువ్వులు

చూస్తే కాని గుర్తురావటం లేదు

ఆ రొజు "పండుగ" అని

'నేటి మహిళ' గా అకుంఠిత దీక్షతో

అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలతో

అపూర్వమైన మేధాసంపత్తితో

అద్వితీయమైన చిత్తశుద్దితో

అవిరళ కౄషి తో అసామాన్య పట్టుదలలతో

అమోఘమైన తెలివితేటలతొ

అపరిమితమైన దౄఢ సంకల్పంతో

అఖండం గా ఆచంద్రార్కం నిరంతరం

నిర్విరామంగా ముందుకు దూసుకుపోతున్న నిన్ను చూసి

సమరరంగం లో ముందుకురిన వీరనారులెందర్నొ,

చరిత్రలో చిరస్తాయిగ నిలచిన నారీమణులెందరినొ

తలచుకుని గర్వపడాలొ!

స్వచ్చమైన అంతః సౌందర్యం కన్నా

అసహజమైన బాహ్య సౌందర్యనికే ప్రముఖ్యత నిస్తున్నావని,

తెలుగుతనం నిండిన కొవ్వొత్తి అరిపోతుందని బాధపడాలొ ???

ఆలొచించరూ? దయచెసి !! ఒక్కసారి

3 comments:

Sky said...

సోదరి హిమ గారికి నమస్కారం ,

మీ నేటి స్త్రీ తేజం చాల చక్కగా ఉంది. నిజంగా మీరు అన్నట్టు మన తెలుగు సంస్కృతిని పండుగ రోజుల్లో తప్ప చూడలేక పోతున్నాము. దీనికి మీ వంతుగా వ్రాసిన కవిత చాల బాగుంది. మీకవిత లో వేదన కనిపించింది. కవితలు ఇంకా వ్రాస్తూ వుండండి.
నేను కూడా చిరు ప్రయత్నం చేస్తున్నాను. వీలయితే నా బ్లాగ్ ని ఒక సారి చూడండి. మీ అభిప్రాయాలని తెలియబరిస్తే సంతోషిస్తాను.
మీ ఈ- సోదరుడు

సతీష్ యనమండ్ర

Anil Dasari said...

భావం బాగుంది కానీ వాక్యాల్నలా లైనుకొకటి కింద విడగొట్టేసి కవిత అనుకోమంటే ఎలాగండీ? దాన్నలాగే వ్యాసంలా ఉంచితే మరింత బాగుండేదేమో. ఆలోచించండి. అచ్చుతప్పుల మీద కూడా కాస్త దృష్టి పెట్టండి. All the best.

Pranav Ainavolu said...

హిమబిందు గారు,
చాలా బాగుందండి.