Tuesday, March 18, 2008

స్నేహం

"స్నేహం అంటె అలలా వచ్చి కలలా కరిగి పొవటం కాదు .నెలవంక లా ప్రవేసించి నిండు పూర్నచంద్రునిలా వెలిగి పోవడం నిజమైన స్నేహం,స్నేహధర్మం ".

స్నేహమేరా!జీవితం! స్నేహఏఎరా!శాశ్వతం!సృస్టిలోన తీయనిది స్నేహమేనొయి! అన్నాడో మహాకవి అది ఎణ నిజం.ఓక మంచి స్నేహితుడు లెక స్నేహితురాలు దొరకటం ఒక గొప్పవరం.ఏ చిన్న విషయం జరిగినా, అది సంతోషం గాని ,బాధ గాని,నీకు ఎవరితో పంచుకోవలనిపిస్తుందో వరె నీ ప్రాణ మిత్రులు.నీ మంచి చెడ్డలను తమ స్వంతం అన్నట్లు వారు భావిస్తారు.ఈ కార్పోరేట్ ప్రపంచం లో డబ్బు,పేరుప్రతిష్టలు ఇంకా దేనినైనా సంపాదించుకొవచ్చు.కాని మంచి మిత్రులు దొరకటం మనకు లభించే అదృస్టం.నీకు కష్టాలలొ సుఖాలలొ తోడు నీడగ వుండి నీ స్వభావానుగుణంగా నిన్ను అర్దం చెసుకుని సమయస్ఫూర్తితొ వ్యవహరించే వారె నీకు నిజమైన స్నేహితులు. స్నేహాన్ని మన వ్యక్తిత్వం తొ అకర్షించుకుని పొందగలగాలి కనే,ధనం లేక మరే ఎతర కారణాల వల్ల కాదు.మంచి పుస్తకం కూడ నీకు మంచి స్నేహితుడి వంటిది.ప్రతే విషయాన్ని విశ్లేషించే అలవాటు దాని ద్వారా కలుగుతుంది.స్నేహం ఇవ్వని దేశం లొ స్నేహితులు లేని ప్రతే మనిషె ద్వీపం క్రిందే లెక్క.నీకు వున్న స్నేహితులును బత్తి నీ వ్యక్తిత్వ ,స్వభావాలను నిర్వచించవచ్చు.ఈ ప్రపపంచ మంతా ఏదెమైనా నీకు నేనున్నా నేస్తం అని చెయుత నందించే వారె నిజమైన స్నేహితులు.

రోజు ఎంతో మంది క్రొత్త క్రొత్త స్నేహితులు మన జీవితమనెడి నావలొ కలుస్తూ వుంటారు. కానే వీరిలొ ఎందరు మనకు నిజమైన స్నేహితులుగా చిరకాలం వుండగలుగుతున్నారు? ఎన్ని స్నెహాలు మనస్ఫర్దలు రాకుండ పటిష్టంగా వుంటున్నాయి? నీకు ఎంత మంది స్నేహితులో ముఖ్యం కాదు,నువ్వు ఎంత మందికి నిజమైన దోస్త్ గ వున్నవో అలొచించుకో! స్నేహం లో ఎంతో విలువ వుంది.నిస్వార్దమైన,నిష్కళంకమైన పవిత్ర అనుబంధమిది.నీ అవసరాన్ని గుర్తించి ఆపద సమయంలో అడగకుండనె సహకరించేవరే నీకు నిజమైన మిత్రులు.స్నేహానికన్న మిన్న లొకన లెదు.అవకాసం ఎటువస్తే అటువైపు పయనించె అవకాసవాదులున్న ఈ కలికాలం లొ,నీకు నిజమైన స్నేహితులెవరొ
ఆలొచించుకొ!ఎపుదు ఏ పరిస్థితులలొ నిన్ను గౌరవించి,నీకు విలువనిచ్చె నీ నేస్తాల్ని మరువకు.

1 comment:

Shankar Reddy said...

బాగా చెప్పారు .......

and Welcome...