Tuesday, January 20, 2009

అమ్మ

నా మదిలో గుండె గుడిలో కొలువున్న అపూర్వ రూపం-- అమ్మ
నా హౄదయం లో నిలిచిన పవిత్రమూర్తి -- అమ్మ
సృష్టి లొప్రతి ప్రాణి కీ మూల కారణం --అమ్మ
డెందం ఆనందం తొ పరవసించినపుడు గుర్తుకువచ్చె మొదటి వ్యక్తి --అమ్మ
డేవుడు తన అంశ గ పంపి0చిన ప్రత్యేక స్వరూపం --అమ్మ

బాదలలొ వోదర్పు -- అమ్మ
కష్టలలో ధైర్యం --అమ్మ
గాయన్ని మాణ్పె మందు --అమ్మ
మన బాధల్ని పంచుకునె ఎకైకవ్యక్తి -- అమ్మ
ఆప్యాయతకు వూపిరి --అమ్మ
నిన్ను వున్నత వ్యక్తిగా తీర్చిదిద్దు అపూర్వ మూర్తి --అమ్మ
ఆనందానికినెలవు--అమ్మ

Tuesday, March 18, 2008

వా రే వా ఇండియా !

యా వ త భా ర తా వ ని పులకించింది !! విజయ గర్వం తో ఆనందం తో సంబరాలు చేసుకున్నారు.
సరిగా ఆడటం లేదు అని , పేలవమైన బౌలింగ్ ,చెత్త బ్యాటింగ్ అని వేలెత్తి చూపిన వాళ్ళకు విమర్శనాస్త్రాలను జులిపించిన వారికి ఒక చక్కటి సమాధానాఒ ఈ విజయం.
ఇరవై రెండేళ్ల చరిత్ర తిరగ రాయ బడింది. మనల్ని గేలి చేసిన వాళ్ళకి వాళ్ళ సొంత గడ్డమీదే వారికి గుణపాఠం అయింది.
ఆస్ట్రేలియ టీమ్ నాయకుడు చెప్పినట్లు మొదటి మ్యాచ్ గెలిచిన టీమ్ నే రెండో మ్యాచ్ కూడా గెలిచి సీరీస్ సొంతం చేసుకుంటుంది అన్నది నిజమైంది.
మన వాళ్ళు దీన్ని సవాల్ గా తీసుకుని సీరీస్ సొంతం చేసుకున్నారు. పాపం ప్యాటింగ్ సేన కె నిరుత్సాహం.
పరుగుల వీరుడు సచిన్ కు , ప్రవీణ్ కుమార్ ప్రతాపం కూడా తోడవటం తో విజయం సునాయసమైంది. చివరివరకు మ్యాచ్ ఉత్కంతతా భరితం గా సాగింది.
ఆ రోజు ఆఫీస్ లో పని కన్నా ప్రతి నిముషానికీ స్కోర్ చూడటం సరిపోయింది.

హాట్సాఫ్ టు టీం ఇండియా!

అది సెప్టెంబర్ మాసం తెదీ 24.యావత్ భారతావని ,నరాలుచిక్కబత్తుకుని చూస్తున్నారు ఆటని. ఆందరికీ ఒకటే ప్రశ్న.ఆ పదకొండు మందీ ఆడె అటలొ మనం నెగ్గుతామ లేదా అని?మనకే కప్ వస్తుందని నమ్మకం. ఆశ.కాకపొతె ఆనిమిషానికి ఏమిజరుగునో కదా అన్న ఒక సంకోచం.మొత్తనికి నిముష నిముషనికి నరాలు తెగె ఉథ్కంటతతో జరిగిన మాచ్ కి విజయం మననే వరించింది. ఇవి నిజంగ మనం చిరకలం గుర్తుంచుకునే మాచ్. సమిస్టి కౄషితో, అకుంటిత దీక్షతొ ,తీవ్ర వొత్తిడిని తట్టుకుని విజయ బవుటాలను ఎగరవెసిన భరత అటగాళ్ళకి న మనస్పూర్తి అభినందనలు. ఆఅ అతని తిలకించటానికి మనం

భవిష్యత్త్ లో కూడ మరిన్ని విజయాలు సాధించాలని కొరుకుంతూ..

హాట్సాఫ్ టు టీం ఇండియా!

నేటి స్త్రీ తేజం

పాస్చ్యాత్య మోజులో పడి కొట్టు మిట్టాడుతున్న

నేటి యువరక్తమా మేలుకో!

మన సంస్కౄతి ,కట్టూ, బొట్టూ

ఆచార వ్యవహారలనేనాడు విస్మరించకు

అనాగరికమైన వేషభాషలను విడనాడి

వాని వునికికి స్వస్తి పలుకు

పరమ పవిత్ర భరతావనిలో అందునా

స్వఛ్చమైన అంధ్రదేశం లో జన్మించే

అదౄష్ఠ భాగ్యం కల్గినందులకు సంతసం తో గర్వపడు

తెలుగు తనాన్నంతా పుణికి పుచ్చుకుని

తెలుగు వెలుగు లా ప్రకాసించే ఓ స్త్రీ తేజమా!

మారుతున్న సమాజానికి అనుగుణంగా మారావ్!

నీ చలాకీతనం ,ధైర్యం,సాహసం,ప్రతిభా సామర్ధ్యాలు

స్వతంత్ర్య భావలతో అన్నింటా ముందుకు సాగుతున్నవ్!

కాని!

నేటి భాద్యతల నడుమ నీ పాదాలకుపండేటి ఎర్రటి

గోరింటాకు చూడటం గగనం అవుతుంది

ఈ కాంక్రీట్ జంగిల్ లో నల్లపూసైన

తెలుగుతనాన్కి వన్నె తెచ్చే పట్టుపరికిణీల

రెపరెపలు, గలగల లాడె గాజుల సవ్వడులు

జాలువారిన కురుల మీద పువ్వులు

చూస్తే కాని గుర్తురావటం లేదు

ఆ రొజు "పండుగ" అని

'నేటి మహిళ' గా అకుంఠిత దీక్షతో

అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలతో

అపూర్వమైన మేధాసంపత్తితో

అద్వితీయమైన చిత్తశుద్దితో

అవిరళ కౄషి తో అసామాన్య పట్టుదలలతో

అమోఘమైన తెలివితేటలతొ

అపరిమితమైన దౄఢ సంకల్పంతో

అఖండం గా ఆచంద్రార్కం నిరంతరం

నిర్విరామంగా ముందుకు దూసుకుపోతున్న నిన్ను చూసి

సమరరంగం లో ముందుకురిన వీరనారులెందర్నొ,

చరిత్రలో చిరస్తాయిగ నిలచిన నారీమణులెందరినొ

తలచుకుని గర్వపడాలొ!

స్వచ్చమైన అంతః సౌందర్యం కన్నా

అసహజమైన బాహ్య సౌందర్యనికే ప్రముఖ్యత నిస్తున్నావని,

తెలుగుతనం నిండిన కొవ్వొత్తి అరిపోతుందని బాధపడాలొ ???

ఆలొచించరూ? దయచెసి !! ఒక్కసారి

స్నేహం

"స్నేహం అంటె అలలా వచ్చి కలలా కరిగి పొవటం కాదు .నెలవంక లా ప్రవేసించి నిండు పూర్నచంద్రునిలా వెలిగి పోవడం నిజమైన స్నేహం,స్నేహధర్మం ".

స్నేహమేరా!జీవితం! స్నేహఏఎరా!శాశ్వతం!సృస్టిలోన తీయనిది స్నేహమేనొయి! అన్నాడో మహాకవి అది ఎణ నిజం.ఓక మంచి స్నేహితుడు లెక స్నేహితురాలు దొరకటం ఒక గొప్పవరం.ఏ చిన్న విషయం జరిగినా, అది సంతోషం గాని ,బాధ గాని,నీకు ఎవరితో పంచుకోవలనిపిస్తుందో వరె నీ ప్రాణ మిత్రులు.నీ మంచి చెడ్డలను తమ స్వంతం అన్నట్లు వారు భావిస్తారు.ఈ కార్పోరేట్ ప్రపంచం లో డబ్బు,పేరుప్రతిష్టలు ఇంకా దేనినైనా సంపాదించుకొవచ్చు.కాని మంచి మిత్రులు దొరకటం మనకు లభించే అదృస్టం.నీకు కష్టాలలొ సుఖాలలొ తోడు నీడగ వుండి నీ స్వభావానుగుణంగా నిన్ను అర్దం చెసుకుని సమయస్ఫూర్తితొ వ్యవహరించే వారె నీకు నిజమైన స్నేహితులు. స్నేహాన్ని మన వ్యక్తిత్వం తొ అకర్షించుకుని పొందగలగాలి కనే,ధనం లేక మరే ఎతర కారణాల వల్ల కాదు.మంచి పుస్తకం కూడ నీకు మంచి స్నేహితుడి వంటిది.ప్రతే విషయాన్ని విశ్లేషించే అలవాటు దాని ద్వారా కలుగుతుంది.స్నేహం ఇవ్వని దేశం లొ స్నేహితులు లేని ప్రతే మనిషె ద్వీపం క్రిందే లెక్క.నీకు వున్న స్నేహితులును బత్తి నీ వ్యక్తిత్వ ,స్వభావాలను నిర్వచించవచ్చు.ఈ ప్రపపంచ మంతా ఏదెమైనా నీకు నేనున్నా నేస్తం అని చెయుత నందించే వారె నిజమైన స్నేహితులు.

రోజు ఎంతో మంది క్రొత్త క్రొత్త స్నేహితులు మన జీవితమనెడి నావలొ కలుస్తూ వుంటారు. కానే వీరిలొ ఎందరు మనకు నిజమైన స్నేహితులుగా చిరకాలం వుండగలుగుతున్నారు? ఎన్ని స్నెహాలు మనస్ఫర్దలు రాకుండ పటిష్టంగా వుంటున్నాయి? నీకు ఎంత మంది స్నేహితులో ముఖ్యం కాదు,నువ్వు ఎంత మందికి నిజమైన దోస్త్ గ వున్నవో అలొచించుకో! స్నేహం లో ఎంతో విలువ వుంది.నిస్వార్దమైన,నిష్కళంకమైన పవిత్ర అనుబంధమిది.నీ అవసరాన్ని గుర్తించి ఆపద సమయంలో అడగకుండనె సహకరించేవరే నీకు నిజమైన మిత్రులు.స్నేహానికన్న మిన్న లొకన లెదు.అవకాసం ఎటువస్తే అటువైపు పయనించె అవకాసవాదులున్న ఈ కలికాలం లొ,నీకు నిజమైన స్నేహితులెవరొ
ఆలొచించుకొ!ఎపుదు ఏ పరిస్థితులలొ నిన్ను గౌరవించి,నీకు విలువనిచ్చె నీ నేస్తాల్ని మరువకు.